Nandamuri Balakrishna: జోరు పెంచిన నటసింహం.. కొండారెడ్డి బురుజు దగ్గర సందడి చేసిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Nandamuri Balakrishna: జోరు పెంచిన నటసింహం.. కొండారెడ్డి బురుజు దగ్గర సందడి చేసిన బాలయ్య
Balakrishna

Updated on: Jul 25, 2022 | 7:05 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు బాలయ్య ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం కర్నూల్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

కర్నూల్ లో బాలకృష్ణ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107 వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే ఈ సినిమాలు జై బాలయ్య అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే రౌడీయిజం అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి