Bhagavanth Kesari: బాలయ్య అభిమానులా మజాకా? మ్యాన్షన్ హౌజ్ బాటిల్స్‌తో అభిషేకం.. వీడియో చూశారా?
'అభిమానులందు బాలకృష్ణ అభిమానులు వేరు'.. అందుకే ఒక్కోసారి కోపంతో ఆయన కొట్టినా, తిట్టినా అందులో ప్రేమనే వెతుక్కుంటారు ఫ్యాన్స్. సాధారణంగా ఏ సినిమా థియేటర్లలోనైనా సిట్యూయేషన్‌తో సంబంధం లేకుండా జై బాలయ్య నినాదాలు చేస్తుంటాయి. అలాంటిది బాలకృష్ణ సినిమానే రిలీజైతే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భగవంత్ కేసరి థియేటర్ల వద్ద అదే పరిస్థితి నడుస్తోంది. సినిమా రిలీజును పురస్కరించుకుని థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.
‘అభిమానులందు బాలకృష్ణ అభిమానులు వేరు’.. అందుకే ఒక్కోసారి కోపంతో ఆయన కొట్టినా, తిట్టినా అందులో ప్రేమనే వెతుక్కుంటారు ఫ్యాన్స్. సాధారణంగా ఏ సినిమా థియేటర్లలోనైనా సిట్యూయేషన్‌తో సంబంధం లేకుండా జై బాలయ్య నినాదాలు చేస్తుంటాయి. అలాంటిది బాలకృష్ణ సినిమానే రిలీజైతే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భగవంత్ కేసరి థియేటర్ల వద్ద అదే పరిస్థితి నడుస్తోంది. సినిమా రిలీజును పురస్కరించుకుని థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోస్టర్లు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. బాణసంచా కల్చారు. డప్పులు, డ్యాన్సులతో నందమూరి హీరోపై తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక బెంగళూరులో అయితే బాలయ్య అభిమానుల హంగామా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. అక్కడ భగవంత్ కేసరి రిలీజ్ సందర్బంగా బాలయ్య ఫ్యాన్స్ ఆయన చిత్ర పటానికి మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్‌తో అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని మారతహళ్లిలో ఉన్న వినాయక థియేటర్ ముందు ఏర్పాటు చేసిన బాలకృష్ణ చిత్ర పటానికి ఓ అభిమాని ఇలా మందు బాటిళ్లతో అభిషేకం చేశాడు. అంతేకాదు దీపారాధన చేసి కొబ్బరి కాయలు కూడా కొట్టాడు. ఆ తర్వాత భారీగా బాణాసంచా కాల్చి బాలయ్యపై వినూత్న శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘బాలయ్య మజాకా’, అని ఒకరు కామెంట్ చేస్తే, ‘బాలయ్యతో అట్లుంటది మరి’ మరొకరు కామెంట్ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. సూపర్ హిట్ టాక్‌తో మొదటి రోజే భారీ వసూళ్లు సాధించాడు. భగవంత్ కేసరి. ఇందులో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. కాజల్ అగర్వాల్ మరో కీ రోల్ పోషించింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా, శరత్‌కుమార్ ఓ కీ రోల్‌లో మెరిశాడు. షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు.
బెంగళూరులో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ..
#MansionHouse తో అభిషేకం 🥵🥵🥵🥵#Bangalore #BhagavathKesari Maranaaa Mass 🔥🔥🔥
జై బాలయ్య… జై జై బాలయ్య ❤️🔥❤️🔥#NandamuriBalakrishna #GodofMassesNBK pic.twitter.com/5yPtD87sCS
— M๏нąn🦁NBK🦁 (@NBKIAN9) October 19, 2023
జై బాలయ్య నినాదాలతో హోరెత్తు తోన్న థియేటర్లు..
మాన్షన్ హౌస్ బాలయ్య కు మాన్షన్ హౌస్ బ్రాందీ తో అభిషేకం…fans abhimanam 🔥🔥🔥 pic.twitter.com/XEKyXDMRcj
— Swathi Reddy (@Swathireddytdp) October 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..