Balakrishna: డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే..

|

Jan 09, 2025 | 9:23 AM

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలయ్యే సినిమాల్లో డాకు మహారాజ్ ఒకటి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 12న విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

Balakrishna: డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే..
Daaku Maharaaj
Follow us on

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ చేశారు నందమూరి బాలయ్య. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన సినిమా వేడుకను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని డాకు మహారాజ్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనంతపురంలో ఈరోజు సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇప్పటికే ఈ వేడుక కోసం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ సంయుక్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా నారా లోకేష్‌ హాజరుకానున్నారని ఇదివరకే చిత్రయూనిట్ తెలియజేసింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ వీడియోకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చేసింది. ఇక కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే రాయలసీమ గడ్డపై ముఖ్యంగా అనంతరంలో ఈరోజు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. జనవరి 9న సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు మేకర్స్. “తిరుప‌తి ఘ‌ట‌న వ‌ల్ల డాకు మ‌హారాజ్ ఈవెంట్ ర‌ద్దు చేస్తున్నాం . మ‌న సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే తిరుప‌తి క్షేత్రంలో అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌రం. మా వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డానికి ఇది స‌రైన త‌రుణం కాదు. భ‌క్తులను, వారి మ‌నోభావాలను గౌర‌విస్తున్నాం. అందుకే మా వేడుక‌ను ర‌ద్దు చేసుకుంటున్నాం. అంద‌రూ అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం” అంటూ ప్రకటించారు మేకర్స్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.