Balakrishna: చిన్నారులతో బాలయ్య బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. కేక్‌ తినిపించి కానుకలందించిన నందమూరి నటసింహం

ఎప్పట్లాగే ఈ సారి కూడా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పేదల కోసమే తన తండ్రి ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో రెండో గొప్ప ఆస్పత్రిగా.. బసవతారకం ఆసుపత్రిని గుర్తించడం చాలా ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ.

Balakrishna: చిన్నారులతో బాలయ్య బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. కేక్‌ తినిపించి కానుకలందించిన నందమూరి నటసింహం
Balakrishna Birthday

Updated on: Jun 11, 2023 | 6:00 AM

హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో శనివారం (జూన్‌ 10) బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ కేక్‌ కట్ చేశారు బాలకృష్ణ. చిన్నారులకు కేక్ తినిపించి.. గిఫ్ట్స్‌ అందించారు. అటు యూఎస్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో బాలయ్య అభిమానులు తమ హీరో బర్త్‌డేను గ్రాండ్‌గా చేసుకున్నారు. అలాగే తమ అభిమాన హీరో పుట్టిన రోజును పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ఫ్యాన్స్‌ పండుగ వాతావరణం సృష్టించారు. తమ హీరో బర్త్‌ డే ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేసుకున్నారు.. ఇక, ఎప్పట్లాగే ఈ సారి కూడా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పేదల కోసమే తన తండ్రి ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో రెండో గొప్ప ఆస్పత్రిగా.. బసవతారకం ఆసుపత్రిని గుర్తించడం చాలా ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ. నిస్వార్థంగా పని చేద్దామని.. ఇకముందు కూడా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

అటు, యూఎస్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో కూడా నందమూరి బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. అతి పెద్ద బిల్ బోర్డ్‌పై బాలకృష్ణ సినిమా సీన్స్‌.. ఫోటోలు ప్రదర్శించారు. ఆయన ఫోటోలు 24 గంటల పాటు ప్రదర్శనకు ఉంచారు. కేక్‌ కట్‌ చేసి.. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు . స్కిల్‌ట్యూన్ టెక్నాలజీస్ ఓనర్, నూజివీడుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ జితేంద్ర అట్లూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..