Balakrishna: బాలయ్య బాబు సినిమా కోసం అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్..

|

Oct 06, 2022 | 5:49 PM

బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ సంచలన విజయాన్ని అందుకున్నారు. బాలయ్య కెరీర్ లో 200 కోట్ల మార్కెట్ టచ్ చేసిన సినిమాగా అఖండ నిలిచింది.

Balakrishna: బాలయ్య బాబు సినిమా కోసం అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్..
Balakrishna, Anil Ravipudi
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య నటిస్తోన్న సినిమా ఇది. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ సంచలన విజయాన్ని అందుకున్నారు. బాలయ్య కెరీర్ లో 200 కోట్ల మార్కెట్ టచ్ చేసిన సినిమాగా అఖండ నిలిచింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఎన్ బీకే 107గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా చివరిదశకు వచ్చేసింది.

ఈ సినిమాతోపాటు ఆహా కోసం అన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ. త్వరలోనే ఈ షో మొదలు కానుంది. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం అనీల్ ఓ ఇంట్రస్టింగ్ లైన్ ను అనుకుంటున్నాడట. తనదైన కామెడీతో పాటు.. యాక్షన్స్ సీన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట అనిల్. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారట. ఒక్కసారి ప్రారంభం అయితే ఎక్కడ చిన్న బ్రేక్ కూడా రాకుండా ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నారట. గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ అయిన వెంటనే అనిల్ సినిమాను పట్టాలెక్కించనున్నారు బాలకృష్ణ. నవంబర్ 2 నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.