
అతిలోకసుందరి శ్రీదేవి.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమకు సుపరిచితమే. తన సినీ ప్రస్థానంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. పాతతరం, కొత్తతరం నటులతో ఆమె పలు సూపర్ హిట్ చిత్రాలు చేసింది. అయితే నందమూరి బాలకృష్ణతో మాత్రం ఒక్క చిత్రంలోనూ నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదనేది చాలామందికి తెలియని విషయం. అయితే దీనిపై స్వయంగా బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు.
శ్రీదేవి, బాలకృష్ణలతో సినిమా చేసేందుకు పలుమార్లు దర్శకనిర్మాతలు ప్రయత్నించారట. కానీ అవేమి కార్యరూపం దాల్చలేదు. 1987లో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు వీరిద్దరి కలయికలో ‘సామ్రాట్’ అనే మూవీని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 1989లో దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన భలే దొంగ చిత్రంలోనూ బాలకృష్ణ సరసన శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవాలని మొదట అనుకున్నారు. కానీ, ఆ సమయంలో శ్రీదేవి తన డేట్స్‌ను సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ అవకాశం చేజారింది. ఈ విధంగా అనేకసార్లు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్ కాలేదు. డేట్స్ అడ్జెస్ట్ అవలేదు. కాగా, టాలీవుడ్ అభిమానులకు బాలకృష్ణ, శ్రీదేవి కలయికలో ఓ సినిమా లేకపోవడం తీరని లోటని చెప్పొచ్చు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..