నందమూరి హీరో బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటిరోజే రూ.56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా.. బాబీ డియోల్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమానకు తమన్ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలెట్. బాలయ్య, తమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ అదిరిపోయింది. వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న బాలయ్య.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. అదే అఖండ 2.
డాకు మహారాజ్ తర్వాత అఖండ 2 సినిమాతో రానున్నాడు బాలయ్య. అయితే ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రయాగ్ రాజ్ కుంభమేళాలోనే అఖండ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇక్కడికి కోట్ల మంది భక్తులు, సాధువులతోపాటు అఘోరాలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2లోనూ అదే పాత్రను కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుంభమేళాలో అఖండ పాత్ర ఉన్నట్లు, అక్కడి అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్లు , త్రివేణి సంగమంలో స్నానం చేసినట్లు కొన్నిషాట్స్ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సారి డివైన్ షాట్స్ మరింత గ్రాండ్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 రిలీజ్ చేయనున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి చిన్న మ్యూజిక్ గ్లింప్స్ సైతం రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
#Akhanda2 – Thaandavam begins its shoot at the Maha Kumbh Mela in Prayagraj, capturing the true essence of faith and devotion 🔱
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/cZ91CUb3Wf
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 13, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..