Tollywood: ఈమెను గుర్తుపట్టారా..? మేడమ్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా..?
ఈమె గతంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆ ఒక్క మూవీతో సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకుంది. అయితే చీరుకట్టులో సంప్రదాయబద్దంగానే ఆమెను చూశారు నెటిజన్స్. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండీ వేర్‌లో షూట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది...

చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావాలంటే.. అనపకాయ అంత ప్రతిభతో పాటు.. ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలంటారు చాలామంది. ఇండస్ట్రీ ఎప్పుడు.. ఎవరి ఫేట్ ఎలా మారిపోతుందో చెప్పలేం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతుంటాయి. కొంతమంది ఏళ్ల తరబడి సినిమాలు చేసినా గుర్తింపు రాదు. మరికొందరు తొలి సినిమాతోనే నోటెడ్ అవుతారు. వారికి మాత్రమే తరచూ ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఓ నటీమణి గురించి చెప్పాలి. తన పేరు లక్ష్మీ. ఎప్పడో సాయిదుర్గ తేజ్ నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లోనే చేసినా.. ఏదో తెలిసిన ఫేస్ అనిపిస్తుంది తప్పితే.. ఆమె కంటూ ఓ ప్రత్యేకత ఉండేది కాదు.
టాప్ హీరోలా సినిమాల్లో చేసినప్పటికీ గుర్తింపు శూన్యం. అయితే ‘బలగం’ చిత్రం ఇండస్ట్రీలో ఆమె గమనాన్ని మార్చింది. పరిణితి చెందిన నటనతో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఒక్క సినిమాతో ‘బలగం’ రూపలక్ష్మిగా పేరుగాంచింది. ఇప్పుడు సినిమాల్లో వరసగా మంచి పాత్రలు దక్కించుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లక్షకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా లక్ష్మి ఒక డాన్స్ వీడియోను షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టీ షర్ట్, జీన్స్‌లో ‘ప్రేమికుడు’ చిత్రంలోని అందమైన ప్రేమరాణి మ్యూజిక్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఆమెను ఇలా చూడటం చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..