Urvashi Rautela: ‏బద్రినాథ్‏లో ఉన్నది ఆమె గుడి కాదు.. హీరోయిన్ కామెంట్స్ పై అర్చకుల సీరియస్..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన మాటలతో ప్రతిసారీ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటనపై ఆమె స్పందించిన తీరుపై నెటిజన్స్ సీరియస్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి తన వివాదాస్పద కామెంట్లతో చిక్కుల్లో పడింది. దీంతో ఆమె మాటలపై అర్చకులు మండిపడుతున్నారు.

Urvashi Rautela: ‏బద్రినాథ్‏లో ఉన్నది ఆమె గుడి కాదు.. హీరోయిన్ కామెంట్స్ పై అర్చకుల సీరియస్..
Urvashi Rautela

Updated on: Apr 18, 2025 | 10:10 PM

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది. తెలుగు, హిందీ భాషలలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే తన మాటలతో వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై అర్చుకులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తన పేరు మీద ఓ ఆలయం ఉందని.. బద్రీనాథ్ కు ఎవరైనా వెళ్తే అక్కడ పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండి అంటూ ఊర్వశి రౌతేలా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నటి ఊర్వశీ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. ” ఉత్తరాఖండ్ లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్ కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ యూనివర్సిటీలోనూ నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను దండమమాయి అని పిలుస్తారు. ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. దీనిపై చాలా వార్త కథానాలు కూడా వచ్చాయి. మీరంతా వాటిని చదవచ్చు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు సీరియస్ అయ్యారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట నిజమేనని.. కానీ ఆ గుడికి, నటికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

పురాణాల ప్రకాం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం లేదా.. శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని అంటారని.. కానీ ఊర్వశీ పేరుతో ఉన్న ఆలయం తనదే అని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ మండిపడ్డారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తిపీఠాల్లో ఒక్కటిగా ఇక్కడి ప్రజలు దేవతగా కొలుస్తారని అన్నారు. ఇది ఆమె గుడి అనే చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఆమె మాటలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?