SonuSood: సోనూసూద్‌ అంటే ఇంత అభిమానమా..! ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏం చూశాడో ఓసారి చూడండి..

|

Jan 31, 2021 | 9:55 PM

Baby Boy Was Named As Sonusood: ఎంతో మందికి దేవుడిలా సాయం అందించి రియల్‌ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూళీలకు రవాణా ఏర్పట్లతో మొదలైన సోనుసూద్‌ దాతృత్వం అనంతరం.. సోషల్ మీడియా వేదికగా...

SonuSood: సోనూసూద్‌ అంటే ఇంత అభిమానమా..! ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏం చూశాడో ఓసారి చూడండి..
వేలాదిమంది వలస కార్మికులను తమ సొంతగ్రామాలకు చేర్చి రియల్ హీరోగా మారాడు 
Follow us on

Baby Boy Was Named As Sonusood: ఎంతో మందికి దేవుడిలా సాయం అందించి రియల్‌ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూళీలకు రవాణా ఏర్పట్లతో మొదలైన సోనుసూద్‌ దాతృత్వం అనంతరం.. సోషల్ మీడియా వేదికగా ఎవరేం సాయం కోరిన ఇచ్చే స్థాయికి చేరింది.
ఇక సోనూసూద్‌ చేస్తోన్న ఈ సేవలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సినిమాలు చూడని వారు కూడా సోనూకు కృతజ్ఞతలు చెబుతున్నారు. తెలంగాణలోని సిద్ధిపేట పట్టణానికి సమీపంలో ఉన్న ఓ తండా ప్రజలైతే ఏకంగా సోనూసూద్‌కు గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. ఇలా సోనూసూద్ కలియుగ కర్ణుడిగా మారడంతో తెలంగాణకు చెందిన మరో ఫ్యాన్‌.. సోనూపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన.. పండగ నవీన్‌, త్రివేణీ దంపతులకు ఇటీవల ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఆ పత్రికలో చిన్నారి పేరును ‘సోనూసూద్‌’గా ముద్రించారు. సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో తల్లిదండ్రులు ఆ చిన్నారికి సోనూసూద్‌ అని పేరు పెట్టుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. నిజంగా సోనూసుద్‌ చాలా గొప్పవ్యక్తని, అతని జన్మ సార్థకమంటూ నెట్టింట్లో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Radhe Shyam Teaser: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రేమికుల రోజున.. ‘అమర ప్రేమికుల’ అప్‌ డేట్‌..?