Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్షన్‌లో “సీతా పయనం”

తమిళ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగానే కాదు విలన్ గాను ఆయన మెప్పించారు. అర్జున్ ఇప్పటికే 130కి పైగా సినిమాల్లో నటించారు. చివరిగా దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు.

Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్షన్‌లో సీతా పయనం
Arjun

Updated on: Oct 17, 2024 | 4:36 PM

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు అర్జున్. తమిళ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగానే కాదు విలన్ గాను ఆయన మెప్పించారు. అర్జున్ ఇప్పటికే 130కి పైగా సినిమాల్లో నటించారు. చివరిగా దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గాను అర్జున్ తన ప్రతిభను చాటుతున్నారు. కాగా నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సీతాపయనం అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

‘సీతా పయనం’ తో మరోసారి దర్శకుడిగా రాబోతున్నారు. బహుముఖ ప్రతిభతో ప్రసిద్ధి పొందిన అర్జున్ సర్జా, ‘జై హింద్’ అలాగే ‘అభిమన్యు’ వంటి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను ఇప్పటికే నిరూపించారు ఈ యాక్షన్ కింగ్. ఇప్పుడు, హృదయాలను కట్టిపడేసే నేపథ్యంతో ఓ అందమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘సీతా పయనం’ శీర్షిక సూచించినట్లుగా, ఈ చిత్రం కుటుంబం అంతా ఆస్వాదించే గొప్ప డ్రామాగా ఉండే అవకాశం ఉందని సమాచారం .

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

సీతా పయనం మూడు భాషల్లో – తెలుగు, తమిళం, కన్నడలో రూపొందిస్తున్నారు. స్వంత సంస్థ శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అర్జున్ సర్జా స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, నటీనటులు, సాంకేతిక బృందంపై మరింత సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా పై అర్జున్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే అర్జున్ నటించిన ఇద్దరు అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us