విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రం అందుకున్న విజయం గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అటు దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా గుర్తింపు తీసుకుచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన కెరీయర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎలా మొదలైంది ?.. ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు ? ఇలాంటి ఎన్నో విషయాలపై వీరిద్దరూ మాట్లాడారు. ఈరోజు వీరి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సందీప్ మాట్లాడుతూ.. చిరు ప్రస్తావన తీసుకువచ్చారు. ఇంతకీ ఏం చెప్పారో తెలుసుకుందామా.
తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానని అన్నారు సందీప్.. “చిన్నతనంలో బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో నేను చేసే పనులు చూసి భయపడి మా అమ్మకు చెబుతామంటూ బెదిరించేవారు. అప్పుడు నేను ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి మంటల్లోకి దూకారు. అప్పుడు ఆయనకు ఏం కాలేదు. కాబట్టి నాకు ఏం కాదు అని చెప్పేవాడిని . మొదట్లో నేను కెమెరా మెన్ కావాలనుకున్నాను.. కానీ ఆ తర్వాత దర్శకత్వంపై ఆసక్తి పెరిగింది. దీంతో డైరెక్షన్లో మెలకువల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యానిమల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సందీప్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇదే షోలో పాల్గోన్న డైరెక్టర్ దేవకట్టా మాట్లాడుతూ.. ” నాగార్జున నటించిన శివ సినిమా చూసి ఇన్సిఫైర్ అయ్యానని.. అలా సినిమాల వైపు అడుగులు వేసినట్లు చెప్పుకోచ్చారు. చెడిపోతున్న సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాలపై ఉందనే చర్చు ఓవర్ రేటెడ్ చర్చగా దేవా కట్టా అభివర్ణించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.