AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్టుగా ఎంగేజ్‌మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Naga Chaitanya, Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 10:13 AM

Share

అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్టుగా ఎంగేజ్‌మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ లవ్ బర్డ్స్ ఎంగేట్‌మెంట్ చేసుకున్న విషయాన్ని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అప్పటి నుంచే చైతన్య, శోభితల నిశ్చితార్థం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఎక్కడ చూసినా వీరి వార్తలే కనిపిస్తున్నాయి. కాగా ఎంగేజ్ మెంట్ తర్వాత నాగ చైతన్య, శోభితలు మళ్లీ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయ్యారు. తమ సినిమాలను వేగంగా కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. కాగా వీరి వివాహంపై ఇటీవల అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో సడెన్ గా ఎంగేజ్ మెంట్ జరిగిందని, అయితే పెళ్లికి మాత్రం కొంచెం సమయం పడుతుందన్నారు. దీంతో చైతన్య, శోభితల వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

కాగా నాగ చైతన్య మరియు శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సరైన వేదికను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో లేదా రాజస్థాన్‌లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం. ఒకవేళ ఇవి కుదరకపోతే విదేశాల్లోనూ గ్రాండ్ వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుందని సన్నిహితులు చెబుతున్నారు. ఈలోపు నాగ చైతన్య, శోభితల సినిమాలు కూడా కంప్లీట్ అవుతాయని, పెళ్లికి తగినంత సమయం దొరకనుందని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్