AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు

తెలుగు చిత్రసీమలో సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతున్నాయి.

Prabhas: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు
Prabhas
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 10:05 AM

Share

తెలుగు చిత్రసీమలో సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు నిర్మాతలు స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజైన మురారి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అక్టోబర్‌ 23న ప్రభాస్ పుట్టినరోజు. దీంతో అతను నటించిన సినిమాలను రీ-రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈ సినిమాలు టీవీలో పదేపదే ప్రసారం అవుతున్నప్పటికీ థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కొత్తగా ఉంటుందని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. దీనికి తోడు ప్రభాస్ కు భారీగా అభిమానులు ఉన్నారని, వారు కచ్చితంగా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23న రీ-రిలీజ్ కానుంది. 2010లో విడుదలైన ‘డార్లింగ్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అన్నీ అంశాలున్నాయి. కాజల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా సెప్టెంబర్ 23న మళ్లీ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న రీ-రిలీజ్ కానుంది. 2002లో విడుదలైన ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది. బస్తీలో పెరిగిన ఒక పేదవాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం, పెద్దలను ఎదురించి ఎలా పెళ్లి చేసుకున్నాడన్నదే ఈశ్వర్ సినిమా. ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఇటీవలే హను రాఘవపూడి సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. వీటితో పాటు ‘కల్కి 2’, ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్