
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రానుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9కు సన్నాహాలు అన్ని పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సీజన్ 9పై అంచనాలు పెంచేశాయి. ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి సామాన్య ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ.. ఈసారి అగ్నిపరీక్ష అనేది మొదలు పెట్టారు. మరోవైపు ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించేవారిని ఎంపిక చేసేందుకు కంటెస్టెంట్స్ వేటలో ఉంది బిగ్‌బాస్ టీమ్.
అలాగే సీజన్ 8 కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే సీరియల్ తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ జంట ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఏపీ పొలిటికల్ లో సెన్సేషన్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్, మాధురి ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి రిలేషన్ బయట పడింది. అయితే ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనుంది అంటున్నారు. బిగ్ బాస్ లో కొంతమంది జంటలు పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే అదే క్యాటగిరిలో ఇప్పుడు ఈ జంట కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా ఎంట్రీ ఇస్తున్నారారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.