Arbaaz Khan: 56 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న ‘జై చిరంజీవ’ విలన్‌.. అమ్మాయి ఎవరంటే?

విడాకుల తర్వాత కూడా మలైకా అర్బాజ్‌తో టచ్‌లో ఉంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే అర్బాజ్‌ పెళ్లికి మలైకా హాజరుకాలేదు. షురా రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడానీకి మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. అర్బాజ్ 'పాట్నా శుక్లా' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలోనే షురా- అర్బాజ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు పెళ్లి పీటలెక్కి తమ జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

Arbaaz Khan: 56 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న జై చిరంజీవ విలన్‌.. అమ్మాయి ఎవరంటే?
Arbaaz Khan Marriage

Updated on: Dec 25, 2023 | 6:43 PM

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, ప్రముఖ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో కలిసి మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం (డిసెంబర్ 24) రాత్రి వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు అర్బాజ్‌ ఖాన్‌-షురాల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అర్బాజ్- మలైకా కుమారుడు అర్హాన్ కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత కూడా మలైకా అర్బాజ్‌తో టచ్‌లో ఉంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే అర్బాజ్‌ పెళ్లికి మలైకా హాజరుకాలేదు. షురా రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడానీకి మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. అర్బాజ్ ‘పాట్నా శుక్లా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలోనే షురా- అర్బాజ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు పెళ్లి పీటలెక్కి తమ జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

అర్బాజ్‌ ఖాన్‌ వివాహానికి రవీనా టాండన్, రాషా హాజరయ్యారు. అలాగే సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, సలీం ఖాన్ తదితర కుటుంబ సభ్యులందరూ సందడి చేశారు. సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లోనే అర్బాజ్‌ పెళ్లి కార్యక్రమాలు జరిగాయి. అర్బాజ్‌ ఖాన్‌ ప్రముఖ నటి మలైకా అరోరాను 1998లో వివాహం చేసుకున్నారు. 2002లో వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2016లో విడిపోతున్నట్లు ప్రకటించారు అర్బాజ్‌- మలైకా. ఆ మరుసటి ఏడాదే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా సత్తా చాటిన అర్బాజ్‌ ఖాన్‌ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవి మూవీలో విలన్‌ గా నటించారు.

ఇవి కూడా చదవండి

కుమారుడితో అర్బాజ్ ఖాన్ దంపతులు

పెళ్లి వేడుకలో సల్మాన్ డ్యాన్స్..

కుటుంబ సభ్యులతో కొత్త దంపతులు పోజులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.