గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే మొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది.ఆ తర్వాత 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టిక్కెట్ రేట్లు పెంపున కు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు పెంచుకోవచ్చని, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంచుకోవచ్చు. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు ఏపీలోని రాజమండ్రిలో నూ మరో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, సునీల్, జయరాం తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. కాగా పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Game Changer AP G.O
BENEFIT SHOW✅
⏲️1⃣ AM
₹6⃣0⃣0⃣ pic.twitter.com/3CiiPs2xLQ— Appanna..💥 (@KattamuriM70306) January 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.