71st National Film Awards: చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహం.. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు పవన్ అభినందనలు

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రకటించింది. శుక్రవారం (ఆగస్టు 01) ప్రకటించిన ఈ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో విజేతలకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

71st National Film Awards: చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహం.. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు పవన్ అభినందనలు
Balakrishna, Pawan Kalyan

Updated on: Aug 02, 2025 | 6:40 AM

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ హవా కొనసాగింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు, నటులకు మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, తేజ సజ్జా నటించిన హనుమాన్‌ రెండు అవార్డులు దక్కించుకుంది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ గాయకుడుగా పి.వి.ఎన్.ఎస్.రోహిత్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు పృథ్వీ, ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు విజేతలకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా జాతీయ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

’71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతలకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. జాతీయ ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా శ్రీ సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి