Anushka Shetty: ఆ జీవితానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అనుష్క కీలక నిర్ణయం..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రమోషన్లలో మాత్రం పాల్గొనలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ... ఎప్పుడో ఒక మూవీ చేస్తుంది. తాజాగా అనుష్క కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Anushka Shetty: ఆ జీవితానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అనుష్క కీలక నిర్ణయం..
Anushka

Updated on: Sep 12, 2025 | 3:06 PM

బాహుబలి సినిమా తర్వాత స్పీడ్ తగ్గించింది అనుష్క శెట్టి. చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటించిన లేటేస్ట్ మూవీ ఘాటి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య విడుదల చేశారు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సీన్లలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇదిలా ఉంటే… కొన్నేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న అనుష్క.. ఇప్పుడు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులపాటు నెట్టింటికి బ్రేక్ ఇస్తున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. తానే స్వయంగా లెటర్ రాసి పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి

“సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే జీవితానికి దూరంగా.. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను” అంటూ తాను రాసిన లెటర్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనుష్క చేసిన పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు స్వీటి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

ఇటీవలే ఘాటి సినిమా ప్రమోషన్లలోనూ అనుష్క పాల్గొనలేదు. కానీ రానా, అల్లు అర్జున్ తో ఫోన్ కాల్ మాట్లాడి సినిమా విశేషాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తానని అన్నారు అనుష్క.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..