పెళ్లిలలో వెయిటర్ గా పనిచేసింది.. బతకడానికి చెత్త తిని.. కట్ చేస్తే..ఇండస్ట్రీని ఊపేసింది..
ఆమెకు తినడానికి ఏమీ లేకపోవడంతో, చెత్తలో మిగిలిపోయిన వాటిని తిని బతికిన రోజులు ఉన్నాయి. ఆమె కుటుంబం ఆమెను డ్యాన్స్ చేయడానికి.. ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ తల్లిదండ్రుల మాట కాదని ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు తన పాటలతో ఇండస్ట్రీని ఊపేసింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా...?

1997లో అగ్నిచక్ర సినిమాతో రాఖీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమెకు సినిమమాల్లో ప్రధాన పాత్రలు లభించకపోయినా, ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. పార్దేశీయ , దేఖ్తా హై తు క్యా , షారుఖ్ ఖాన్ తో కలిసి చేసిన మై హూ నా వంటి పాటలు ఆమెకు మరింత పాపులారిటినీ తెచ్చిపెట్టాయి. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్పెషల్ డ్యాన్సర్లలో ఒకరిగా నిలిపాయి.రాఖీ పేదరికం, హృదయ విదారకం, అనేక తిరస్కరణలను ఎదుర్కొంది. కానీ ఆమె ధైర్యమైన వ్యక్తిత్వం, ఎప్పుడూ వదులుకోని వైఖరి ఆమెను వెలుగులోకి తెచ్చాయి.కానీ కెరీర్ మొదట్లో అవమానాలు ఎదుర్కొంది.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లోకి అడుగుపెట్టింది. అప్పుడు టాప్ 4గా నిలిచింది. ఇక తర్వాత 2015లో మరోసారి హౌస్ లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.అలాగే ఆమె జీవితంలో ప్రేమ, పెళ్లి కలిసిరాలేదు. ప్రస్తుతం ఒంటరిగా దుబాయ్ లో నివసిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..




