Anupama Parameswaran: నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అలరిస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల అనుపమకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనుపమ అందానికి ఫిదా అయిన కుర్రాళ్ళు అనుపమ పైన కవితలు కావ్యాలు రాస్తూ.. కలలుకంటూ ఉంటారు. తాజాగాఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించి.. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది అనుపమ.‘‘ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. ‘18 పేజీలు’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. అలాగే కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘తల్లిపోగాదే’లో నటిస్తున్నాను. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని చూస్తున్నా .. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తాను’’ అని తెలిపింది ఈ బ్యూటీ.
అంతే కాదు తన లైఫ్ లో లవ్ ఫెయిల్ కూడా ఉందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ‘గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్ అయిపోయింది’. అని తెలిపింది. ఇదిలా ఉంటే గతంలో ప్రముఖ క్రికెటర్ జాస్పిత్ బుమ్రా తో అనుపమ ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ అమ్మడు లవ్ ఫెయిల్ అయ్యిందని చెప్పడంతో అనుపమ అభిమానుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలాగే తనకు సినిమా ఇండస్ట్రీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ మంచి ఫ్రెండ్ అని తెలిపింది అనుపమ.
మరిన్ని ఇక్కడ