Anupama Parameshwaran: మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది.. నెట్టింట అనుపమ అసహనం.. ఎందుకంటే..

ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనుపమకు ఇప్పుడు కోపం వచ్చింది.. షేమ్ ఆన్ యూ అంటూ తన ఇన్ స్టా ఖాతాలో అసహనం వ్యక్తం చేసింది అనుపమ..

Anupama Parameshwaran: మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది.. నెట్టింట అనుపమ అసహనం.. ఎందుకంటే..
Anupama

Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:11 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. సంప్రదాయబద్దంగా కనిపిస్తూ.. అందం, అభినయంతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించికుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనుపమకు ఇప్పుడు కోపం వచ్చింది.. షేమ్ ఆన్ యూ అంటూ తన ఇన్ స్టా ఖాతాలో అసహనం వ్యక్తం చేసింది అనుపమ.. ఎప్పుడు సరదాగా కనిపిస్తూ.. నెట్టింట్లో సందడి చేసే అనుపమకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకుందామమా..

పరిసరాలు పరిశుభ్రత.. మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. ప్లాస్టిక్ చెత్తను రోడ్లపై విచ్చలవిడిగా పడేస్తున్నారు. దీంతో రోడ్లపై రాకపోకలకు.. కాలినడకన వెళ్లేవారికి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. అలా రోడ్లపై చెత్త ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సీరియస్ అయ్యింది అనుపమ్.. ఆమె షేర్ చేసిన ఫోటోలలో చెత్త దగ్గరే ఆవులు నిల్చుని తింటూ ఉన్నాయి.. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ” నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలాగే మొదలవుతుంది.. ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చూస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్నవారిని చూస్తే నాకు సిగ్గుగా ఉంది.. సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్” అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.