అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏఎన్నార్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుక హైదరాబాద్ లో నిన్న ( సోమవారం ) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజీకయ ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు విశేష అతిధిగా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డుని ప్రధానం చేశారు. అలాగే ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు చివరి మాటలను వినిపించారు. అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ లో అక్కినేని నాగేశ్వరరావు చివరిసారి మాట్లాడిన ఆడియోను స్క్రీన్ పై ప్లే చేశారు. ఆయన మాటలు వింటూ సినీ ప్రముఖులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకూ ఆ ఆడియోలో ఏముందంటే..
ఈ ఆడియోను నాగేశ్వరరావు ఐసీయూలో ఉన్నప్పుడు రికార్డ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నా శ్రేయోభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ద వహిస్తున్నారో..నా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారో.. నాకు బాగా తెలుసు.. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్‌ను చెబుతున్నారు.. మిమ్మల్ని ఇబ్బందిపెట్టకుండా.. మీరు బాధపడకుండా మిమ్మల్ని సంతోష పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను బాగానే ఉన్నాను. రికవర్ అవుతున్నాను. ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం ఏమీ లేదు.. త్వరలోనే బయటకు వచ్చేస్తాను.. త్వరలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఆరోగ్యంగా తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నారు.
“మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది నాకు తెలుసు.. నా ఆరోగ్యం, నా సంతోషం, ఆస్థి.. నాకు దొరికే ఆశీర్వాదాలే.. అని నాకు ప్రగాఢ విశ్వాసం నాకుంది.. అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.ఇప్పుడు బయటకు వస్తానని నమ్మకం ఉంది. అది అలాగే కొనసాగాలని. .. ఆరోగ్యం బాగుండి.. ఆప్తులంతా సంతోషపడాలని ఆశిస్తున్నాను.. ఆకాంక్షిస్తున్నాను.. సెలవ్.. మీ ఆశీర్వదామే నాకు ముఖ్యం” అని అన్నారు ఏఎన్ఆర్. ఈ మాటలకూ అక్కడున్న అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ANR’s Touching Last Message: A Legacy of Love and Gratitude | TFPC #ANR #AnrAwards #ANRLivesOn pic.twitter.com/Aht9skhtLN
— Telugu Film Producers Council (@tfpcin) October 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.