యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ . డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 18న రిలీజ్ కానుంది. గత కొద్ది రోజులుగా సరైన హిట్ అందుకోని సంతోష్ శోభన్ ఈ సినిమాతో విజయం సాధిస్తాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని, మలయాళ యంగ్ హీరో దుల్కర్ సాల్మన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక ప్రసారంలో చూసేయ్యండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.