Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై స్పందించిన అంజలి.. అలా ఎవరూ చెప్పలేదంటూ..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజైంది.

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై స్పందించిన అంజలి.. అలా ఎవరూ చెప్పలేదంటూ..
Anjali

Updated on: Jan 28, 2025 | 9:46 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్స్ గా నటించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజైంది. మొదటి రోజే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు కొల్లగొట్టింది. అయితే లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి స్పందించింది. ఈ మూవీలో పార్వతిగా అద్భుతంగా నటించిందీ తెలుగమ్మాయి. అంజలి నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రిజల్ట్ పై అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది . ఆమె నటించిన మదగజరాజ జనవరి 31న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోన్న ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

‘ ఓ నటిగా నేను నా రెస్పాన్సిబిలిటీని మాత్రమే తీసుకోగలను కదా. నన్ను నమ్మి నా పాత్రను డిజైన్ చేసినపుడు దానికి మనం 100 శాతం పని చేశామా లేదా అనేదే నా బాధ్యత. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్‌కు వెళ్తుంటాం. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాం. గేమ్ ఛేంజర్ చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ కూడా సినిమా బాగోలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూసాం అని నాకు చెప్పారు. ఒక సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ ఛేంజర్ మంచి సినిమా నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. అయినా గేమ్‌ ఛేంజర్‌ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు’ అని చెప్పుకొచ్చింది అంజలి.

ఇవి కూడా చదవండి

గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.