
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు ఇప్పటికే వచ్చిన టీజర్స్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా యానిమల్ మూవీ నుంచి నాన్న నువ్వు నా ప్రాణం లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీ కొడుకులైన అనిల్ కపూర్- రణ్‌బీర్ కపూర్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో సాగే ఈ పాట అందరినీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ ఎమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ఈ లిరికల్ సాంగ్‌ను ఎమోషనల్ అవుతున్నారు. నాన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ యానిమల్ సాంగ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో అద్భుతంగా రీక్రియేట్ చేశాడు. ఈ వీడియోకు నాన్నకు ప్రేమతో అని ఎమోషనల్ క్యాప్షన్ జత చేశాడు. తండ్రీ కొడుకులైన కేసీఆర్, కేటీఆర్ ల అనుబంధాన్ని ఎలా ఉందో ఈ వీడియోలో చక్కగా చూపించాడు సదరు నెటిజన్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష.. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావం.. ఆపై తెలంగాణ అభివృద్ధికి తండ్రీ కొడుకుల చేసిన కృషిని వివరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను చూసి స్పందించారు. లవ్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. మరి మీరు కూడా ఈ ఎమోషనల్ వీడియోను చూసేయండి.
నాన్నకు ప్రేమతో 😍@KTRBRS #KCR #KTR pic.twitter.com/p4R3CfzQyv
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) November 25, 2023
యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే తృప్తి ధిమ్రి, శక్తి కపూర్, పృథ్వీ రాజ్, ప్రేమ్ చోప్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.