Animal: యానిమల్‌లో ఆ సీన్స్ చూసి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసిన ఎంపీ కూతురు..!
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఓ రెట్రెండ్ ను సెట్ చేసిందనే చెప్పలి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆయన టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కు వెళ్ళాడు. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజులు అవుతున్నా.. ఇప్పటికే థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు ఎగబడుతున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఓ రెట్రెండ్ ను సెట్ చేసిందనే చెప్పలి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆయన టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కు వెళ్ళాడు. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పై కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ చాలా మంది సినిమాను ప్రశంసిస్తున్నారు. ఇక యానిమల్ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. వీటి పై ఒకొక్కరు ఒకొక్కల స్పందిస్తున్నారు. చాలా మంది ఈ సినిమా పై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ఈ చిత్రం కంటెంట్‌పై విరుచుకుపడ్డారు మరియు సినిమా చూసి తన కుమార్తె ఏడుస్తూ థియేటర్ల నుండి బయటకు వచ్చిందని అన్నారు. రంజీత్ రంజన్ మాట్లాడుతూ, “సినిమా అనేది సమాజానికి అద్దంలాంటిది, మనం దానిని చూస్తూ పెరిగాము, సినిమా అనేది యువత పై చాలా ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో అలాంటి కొన్ని సినిమాలు వస్తున్నాయి, రీసెంట్ గా యానిమల్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూడటానికి వెళ్ళింది, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్ళిపోయింది అని అన్నారు. కబీర్ సింగ్‌ని చూడండి.. సినిమాలో హీరో తన భార్యను, వ్యక్తులపై అలాగే సమాజం పై ఎలా ప్రవర్తిస్తాడో చూపించారు.
యానిమల్ సినిమా గురించి నా కూతురు చాలా చెప్పింది.. ” చాలా హింస సినిమాలో చూపించారు, హింస, మహిళల వేధింపులు అలాంటి వాటిని చిత్రాలలో చూపించడం నాకు ఇష్టం లేదు. ఈ నెగెటివ్ రోల్స్ ప్రెజెంట్ చేయడంలో ఈ పిక్చర్స్,ఈ హింస, ఈ రోజుల్లో మన 11,12వ తరగతి పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. దీనినే రోల్ మోడల్ గా భావించడం మొదలుపెట్టారు. మనం సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి సమాజంలో కూడా ఇలాంటి హింసను చూస్తున్నాం. సినిమాలో “అర్జన్ వాయిలీ” పాటను ఉపయోగించడాన్ని కూడా ఎంపీ విమర్శించారు. పంజాబీ యుద్ధ గీతంను సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర హంతక విధ్వంసానికి దారితీసే సన్నివేశంలో చూపించారని ఆమె అన్నారు.
पूर्व राज्यसभा सांसद श्रीमती छाया वर्मा जी के पति डॉ. दयाराम वर्मा जी के निधन का समाचार अत्यंत पीड़ादायक है। दुःख की इस घड़ी में छत्तीसगढ़ कांग्रेस परिवार वर्मा परिवार के साथ खड़ा है, ईश्वर शोक संतप्त परिवार को इस पीड़ा को सहन करने का सामर्थ्य 🙏
— Ranjeet Ranjan (@Ranjeet4India) November 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




