Anil Ravipudi : ఎఫ్ 4 సినిమాలో నటించేది వీరే.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

| Edited By: Ravi Kiran

Jun 09, 2022 | 11:09 AM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో మరో సాలిడ్ హిట్టు అందుకున్నాడు అనిల్.

Anil Ravipudi : ఎఫ్ 4 సినిమాలో నటించేది వీరే.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
Anil
Follow us on

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఇటీవలే ఎఫ్ 3(F3) సినిమాతో మరో సాలిడ్ హిట్టు అందుకున్నాడు అనిల్. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు మించి ఫన్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. వెంకీ, వరుణ్ లతోపాటు సునీల్ కూడా యాడ్ అవ్వడంతో థియేటర్స్ లో నవ్వుల వర్షం కురిసింది. వెంకీ, వరుణ్ కామెడీ టైమింగ్ తోపాటు తమన్నా , మెహ్రీన్, సోనాల్ చౌహన్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన చిత్రంగా ఎఫ్ 3 సక్సెస్ అయ్యింది. ఇక ఈ ఫన్ ఫ్రాంచైజీ ని కొనసాగిస్తామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఎఫ్ 4 పై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఎఫ్ 4 ఉంటుందని అనిల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎఫ్ 4లోనూ వెంకీ , వరుణ్ ఉంటారా లేక వేరే హీరోలతో ఉంటుందా అన్న దానికి కూడా క్లారిటీ ఇచ్చారు అనిల్.

వెంకటేష్, వరుణ్ తేజ్ లు కన్ఫామ్ గా ఉంటారు. వెంకీ , వరుణ్ తో పాటు కొత్త వారు యాడ్ అవుతారని అనిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే తమన్నా, మెహ్రీన్ కు బదులు వేరే హీరోయిన్స్ ఉంటారని అన్నారు అనిల్.  ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా పక్క కమర్షియల్ మూవీగా తెరకెక్కుతోంది. యాక్షన్ నన్నివేశాలతో పాటు అనిల్ తన మార్క్ కామెడీని యాడ్ చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయ్యి ఎఫ్ 4 రావడానికి ఎంత లేదన్న 2 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. మరో ఇంట్రస్టింగ్ కథతో ఎఫ్ 4 ను తెరకెక్కించనున్నాడు అనిల్.  మరి ఎఫ్ 4 ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి