తెలుగు ప్రేక్షకులకు సుమ (Suma) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. బుల్లితెరపై రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. తన వ్యాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. సుధీర్ఘ కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతుంది. జయమ్మ పంచాయతీ సినిమాతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జయమ్మ పంచాయితీ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 6న విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు (ఏప్రిల్ 30న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ వేడకకు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక ప్రసారంలో చూడొచ్చు..
జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‌గా..