దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరురా, వాడవాడలా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. ఇక సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అంతేకాదు తమ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్ రష్మీ కూడా వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అయితే ఈ వీడియోపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనికి కారణమేంటంటే.. ఇందులో కొందరు భక్తులు ఏనుగును టార్చర్ చేస్తూ విన్యాసాలు చేయించారు. ఇదే రష్మీ ఆగ్రహానికి కారణమైంది. స్వతహాగా యానిమల్ లవర్ అయిన యాంకర్ రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ మూగజీవాలను ఇలా ఇబ్బంది పెట్టవద్దంటూ కోరింది. ‘ఇది చాలా బాధాకరం. ఊరేగింపుల్లో జంతువులను నివారించాలి. ఏనుగు చెవులను బుల్ హక్‌తో పొడిచి టార్చర్ చేస్తూ.. ఇలా విన్యాసాలు చేయిస్తున్నారు. హిందువులు, అలాగే సనాతన ధర్మాన్ని అనుసరించే వారు పండగలు, పర్వదినాల్లో ఇలా మూగజీవాలకు హాని జరగకుండా చూసుకుందాం. ఇది ఓల్డ్ వీడియోనే. అయినా మరొకొసారి మీకు చెబుతున్నా. ఈ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది రష్మీకి అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే మరికొందరు ఎప్పటిలాగే నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పుడే కాదు గతంలోనూ పలు సందర్భాల్లో మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంది రష్మీ. ముఖ్యంగా కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టి తన మంచి మనసును చాటుకుంది. అలాగే ఎక్కడైనా మూగజీవాలకు హాని జరిగితే తక్షణమే స్పందిస్తుంది. అయితే జంతు ప్రేమికులురాలిగా ఆమె షేర్ చేసే పోస్టులు ఒక్కసారి మిస్ ఫైర్ అవుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పిల్లలపై కుక్కల దాడి విషయంలో రష్మీ అభిప్రాయాలపై విమర్శలు వచ్చాయి. అలాగే బక్రీద్ పండగ సందర్భంలో ఆమె చేసిన ట్వీట్‌పై కూడా కొందరు మండిపడ్డారు. ఇక కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇక స్టార్ యాంకర్‌గా బుల్లితెరపై హవా సాగిస్తోన్న రష్మీ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ లో తళుక్కున మెరిసిందీ అందాల యంకరమ్మ. అలాగే కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ హాస్టల్ బాయ్స్ తెలుగు వెర్షన్‌లోనూ ఓ కీ రోల్ పోషించింది.
This video is extremely sad
Animals should be avoided in such processions
Ears of the elephant are being drilled with a bull hook which is a torture device to make them perform such tricks
As Hindus and Sanatan Dharma followers we shud ensure no animals are harmed during our… https://t.co/7egW7nH70W— rashmi gautam (@rashmigautam27) September 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.