HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

|

Apr 29, 2021 | 12:06 PM

Hari Teja Emotional: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల శారీక‌ర‌ ఆరోగ్యాల‌తో పాటు వారి మాన‌సిక ఆరోగ్యాల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తోంది. వైర‌స్ కార‌ణంగా అనారోగ్యం పాల‌వుతోన్న వారు కొంద‌రైతే త‌మకు...

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.
Hariteja About Corona
Follow us on

Hari Teja Emotional: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల శారీక‌ర‌ ఆరోగ్యాల‌తో పాటు వారి మాన‌సిక ఆరోగ్యాల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తోంది. వైర‌స్ కార‌ణంగా అనారోగ్యం పాల‌వుతోన్న వారు కొంద‌రైతే త‌మకు ఇష్ట‌మైన వారిని దూర‌మ‌వుతూ మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్న వారు మ‌రికొంద‌రు. క‌రోనా మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని కూడా పెంచేసింది. చివ‌రికి క‌న్న బిడ్డ‌ను త‌ల్లి కూడా తాక‌ని పరిస్థితి తీసుకొచ్చిందీ మాయ‌దారి రోగం. యాంక‌ర్‌, న‌టి హ‌రితేజ‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైందంటా.. గ‌ర్భిణీగా ఉన్న స‌మ‌యంలో హ‌రితేజ ఎదుర్కొన్న ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానులతో పంచుకున్నారీ యాంక‌ర్‌.
హ‌రితేజ ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆమెకు వారం రోజుల్లో డెలివ‌రీ అనగా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. ఆ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను ఓ వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో హ‌రితేజ మాట్లాడుతూ.. ‘డెలివ‌రీకి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌స‌మ‌యంలో మా కుటుంబం మొత్తానికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. నాక్కూడా క‌రోనా అని తేల‌డంతో.. నాకు వైద్యం అందించిన వైద్యులు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాను. నా భర్తకు నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అనంత‌రం నాకు పాప పుట్టింది. పాపకు కరోనా నెగిటివ్ అని తేల‌గానే త‌న‌ను నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్‌లో బేబీని చూసేదాన్ని. క‌నీసం పాప‌కు పాలు కూడా ఇవ్వ‌లేక‌పోయాను.. ఆ స‌మ‌యంలో నాకు ఎంతో బాధ అనిపించింది. ఇక చికిత్స త‌ర్వాత నన్ను ఇంటికి పంపించేశారు. త‌ర్వాత దేవుడి ద‌య వ‌ల్ల మా ఇంట్లో వారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది’ అని హ‌రితేజ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి మాట్లాడిన హ‌రితేజ‌.. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపాల‌ని సూచించారు. మంచి ఆహారం తీసుకుంటూ.. స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని చెప్పుకొచ్చారు. నాకు ఏమ‌వుతంద‌న్న భావనతో ఉండ‌కుండా.. మాస్కులు వేసుకుంటూ, ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉంటే చోట్ల‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని సూచించారు.

హ‌రితేజ పోస్ట్ చేసిన ఎమోష‌న‌ల్ వీడియో..

Also Read: MP Curfew Extended: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా ఉధ‌ృతి.. మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..

Viral: ఈ యువకుడు అదృష్టం కోసం పిచ్చి పని చేశాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే.!