
టాలీవుడ్ టాలెంటెడ్ నటి.. యాంకర్ అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర మెసేజ్ చేసింది. తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియో అనసూయ వెక్కి వెక్కి ఏడ్చింది. “హలో అందరికీ.. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరంతా కన్యూజ్ అయ్యి ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే.. ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి.. ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి.. విజ్ఞానాన్ని పంచుకోవడానికి. లైఫ్ స్టైల్… సాంప్రదాయలను.. సంతోషాలను షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఉంది. కానీ నిజంగా అదే జరుగుతోందా ?.. ఏది ఏమైనా.. ఈ పోస్ట్ ఎందుకు చేశానంటే.. నేను ఏ ఫోటోషూట్‌లు.. క్యాండిడ్స్..సరాదాగా తీసుకున్న ఫోటోస్, నవ్వులు.. డాన్సులు.. కౌంటర్లు.. అన్నింటిని మీతో పంచుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నా జీవితంలో ఒక భాగమే.. అలాగే నా జీవితంలోని ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి. అన్ని సమయాల్లో నేను బలంగా ఉండడం కుదరదు.. కొన్నిసార్లు బలహీనంగా ఉన్నాను. ఎన్నో బ్రేక్ డౌన్స్ ఉన్నాయి “అంటూ రాసుకొచ్చింది.
అలాగే ఇది అనివార్యం.. మనిషిగా ఉండటం.. ప్రతిదీ నిజం.. ఒక జఘన వ్యక్తిగా.. నేను తటస్థ భావాలు.. డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తాను. కానీ ఆ అది నా బలం కాదు.. ఇదిగో ఇదే నా బలం. ఇక్కడ నా భావోద్వోగాన్ని పంచుకోవడం.. ఇప్పటికీ నేను నమ్ముతున్న విషయాలపై బలంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాను. మనసుకు బాధ కలిగినప్పుడు బాగా ఏడ్చి, లేచి, ఒకటి రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్లీ రోజును ప్రారంభిస్తాను అంటూ రాసుకొచ్చింది. విశ్రాంతి తీసుకోండి.. రీబూట్ చేయండి.. కానీ వదిలేయకూడదదు. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల దయతో వ్యవహరించండి.. ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా మీకు నచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే వారు ఎంతగానో బాధపడతారు. మీ మాటలతో వారు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో ఊహించుకోండి. ఇంకా వారికి పూర్తిగా తెలియని, వ్యక్తిగతంగా ఎప్పటికీ కలుసుకోలేని వ్యక్తులకు సంబంధించిన విషయాల గురించి చెడుగా ప్రచారం చేసేముందు.. వారు మనుషులే అని గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ చెడు ప్రచారం చేసేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకోవడం.. నాపై వచ్చే నెగిటివిటిని ఎదుర్కొవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను. నేను బాధపడిన రోజులను గుర్తుంచుకోవడానికి రికార్డ్ చేసిన వీడియో ఇది.. 5రోజుల క్రితం వీడియో అంటూ క్లారిటీ ఇచ్చింది.
కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ..
అనసూయ షేర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అనసూయకు ఏమైంది ?. అంటూ ప్రశ్నిస్తుండగా.. మరికొందరు అనసూయకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ? ఇదిలా ఉంటే.. ఇటీవల అనసూయ తన భర్త పిల్లలతో కలిసి వేకేషన్ వెళ్లింది. అక్కడ తన ఫ్యామిలీతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమెపై తీవ్రస్థాయిలో నెగిటివిటి ఏర్పడింది. ఇక మరికొందరు అనసూయను ట్రోల్ చేయగా… ఈ క్రమంలోే ఆమె చాలా అప్సేట్ అయినట్లుగా తెలుస్తోంది.
అనసూయ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.