Anasuya Bharadwaj: సునీల్ కు జోడీగా అందాల అనసూయ.. నెగిటివ్ పాత్రలో కనిపించనున్న రంగమ్మత్త

అనసూయ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అందాల భామ యాంకర్ గా బుల్లితెరపైన రాణిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలుసినిమాలో నటించి మెప్పిస్తుంది.

Anasuya Bharadwaj: సునీల్ కు జోడీగా అందాల అనసూయ.. నెగిటివ్ పాత్రలో కనిపించనున్న రంగమ్మత్త
Follow us

|

Updated on: Apr 25, 2021 | 7:38 AM

Anasuya Bharadwaj : అనసూయ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అందాల భామ యాంకర్ గా బుల్లితెరపైన రాణిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలుసినిమాలో నటించి మెప్పిస్తుంది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ అందాల యాంకరమ్మకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటించింది. ఈ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుకుంది. ఇక స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ తోనే కాదు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలోనూ నటించింది అనసూయ.

ఇక ఈ అమ్మడు ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తుంది. అలాగే సుకుమార్, అల్లు అర్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో అనసూయ కనిపించనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు. అనసూయ సునీల్ కు జోడీగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్. ఆమె పాత్రను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట సుకుమార్. అంతే కాదు ఆమె ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనుందట. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాతోపాటు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తుంది. అలాగే  ‘ది చేజ్’ ‘థాంక్ యు బ్రదర్’ వంటి సినిమాలలో కూడా నటిస్తోంది ఈ రంగమ్మత్త.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

 Pawan Kalyan: మహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.. దిల్ రాజు ప్లాన్ అదుర్స్..

Ram Charan: త్వరలో రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..