Anasuya Bharadwaj: రంగస్థలం రంగమ్మత్తను దాక్షాయణి మరిపిస్తుందా..? అనసూయ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పుష్ప.

Anasuya Bharadwaj: రంగస్థలం రంగమ్మత్తను దాక్షాయణి మరిపిస్తుందా..? అనసూయ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్
Anasuya
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2021 | 6:16 AM

Pushpa : అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పుష్ప. పుష్పపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటికి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. అయితే రంగస్థలం రంగమ్మత్తగా రాణించిన అనసూయ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందని తెలుస్తుంది. ఈ పాత్రతో ఆమె రంగస్థలం రంగమ్మత్తను మరిపించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు పుష్ప సినిమాలో అనసూయ సునీల్ భార్య గా కనిపించనుందని టాక్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్