Anasuya: కాస్త బిజీగా ఉన్నాను అందుకే కుదరడంలేదు అంటున్న అనసూయ.. ఇకపై వారానికి మూడుసార్లు ట్రై చేస్తా అంటూ..

జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ రాణిస్తుంది. రంగస్థలం సినిమా అనసూయ డిమాండ్ పెంచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

Anasuya: కాస్త బిజీగా ఉన్నాను అందుకే కుదరడంలేదు అంటున్న అనసూయ.. ఇకపై వారానికి మూడుసార్లు ట్రై చేస్తా అంటూ..
Anasuya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 12, 2024 | 4:55 PM

అందాల యాంకరమ్మ అనసూయకు ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ రాణిస్తుంది. రంగస్థలం సినిమా అనసూయ డిమాండ్ పెంచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.

ఇక ఈ అమ్మడు తన పై జరిగే ట్రోల్స్ పై కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. తన పై ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసినా.. పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టినా ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంది అనసూయ. అలాగే సమాజంలో జరిగే అనేక విషయాల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ఇటీవల అనసూయ కాస్త బొద్దుగా మారింది. ఎప్పుడు స్లిమ్ గా ఫిట్ గా ఉండే అనసూయ ఇలా కాస్త బొద్దుగా కనిపించగానే ఆమెను ట్రోల్ చేస్తూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి మేడం బొద్దుగా అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అనసూయ స్పందించింది.

సోషల్ మీడియాలో దీని గురించి అనసూయ మాట్లాడుతూ.. నేను రెగ్యులర్ గా జిమ్ చేస్తాను.. ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్ చేయలేకపోతున్నా.. వారానికి మూడు సార్లు ఖచ్చితంగా జిమ్ చేసేందుకు ట్రై చేస్తా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూడు పదుల వయసులోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా, యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇచేలా చాలా ఫిట్ గా అందంగా ఉంటుంది. ఇక సినిమాలో గ్లామర్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది అనసూయ. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తన అందాలతో మతిపోగొట్టింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో చేస్తుంది ఈ బ్యూటీ. ఈ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించనుంది ఈ అందాల భామ.

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే