నన్ను పెళ్లి చేసుకుంటానంటే నో చెప్పారు.. లేటైనా పర్లేదంటున్న హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలోకి ఇప్పుడిప్పుడే పలువురు హీరోయిన్స్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీరా జాస్మిన్, లయ, లైలా, స్నేహా వంటి హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఓ కథానాయికగా లేటేస్ట్ లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయింది.

నన్ను పెళ్లి చేసుకుంటానంటే నో చెప్పారు.. లేటైనా పర్లేదంటున్న హీరోయిన్
Actress

Updated on: Feb 18, 2026 | 5:04 PM

ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కోరుకునేవాడు.. అంతలా తన అందంతో మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆతర్వాత ఓ టీవీ షోలో షాకింగ్ లుక్ లో కనిపించింది. అందానికి ఆధార్ కార్డుల ఉండే ఆ ముద్దుగుమ్మ బక్కచిక్కిపోయి.. అందమైన లుక్ మొత్తంపోయి ఊహించని విధంగా మారిపోయింది. అనారోగ్యం కారణంగానే తాను అలా మారిపోయాను అని తెలిపింది. ఇప్పుడు తిరిగి కోలుకొని అందంగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన అనారోగ్యం గురించి, ప్రేమ, పెళ్లితోపాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడింది ఆ అందాల తార. ఇంతకూ ఆమె ఎవరంటే..

రేఖ వేదవ్యాస్.. ఇలా చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు.. ఆనందం మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగులో ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకలకు దగ్గరైంది. కర్నాటకకు చెందిన ఆమె 2001లో శ్రీనువైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రేఖ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఆనందం తర్వాత జాబిలి చిత్రంలో కనిపించింది. నందమూరి తారకరత్న సరసన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్ కావడంతో రేఖ క్రేజ్ మారిపోయింది..

తెలుగులో దొంగోడు, జానికి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకుందాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు చిత్రాల్లో నటించింది. 2008లో నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా కనిపించింది.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మీరెందుకు పెళ్లి చేసుకోలేదు.? మీకు ఇష్టమైన వాళ్లు దొరకలేదా.? ఏదైనా బ్యాడ్ పాస్ట్ ఉందా.? అని యాంకర్ ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం చెప్పింది. దీనిపై హీరోయిన్ రేఖ స్పందిస్తూ.. గతంలో కొందరు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో నో చెప్పా.. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. వాళ్లు నన్ను ఇష్టపడలేదు. అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న ఘటనలు చాలా చూశాం. పెళ్లి చేసుకుంటారు.. ఏడాదికి, రెండేళ్లకే డివోర్స్ అంటున్నారు. విడాకులు ఇచ్చేదానికి పెళ్లెందుకు చేసుకుంటున్నారు. నేను ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా.. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా.. ఇప్పటివరకూ కరెక్ట్ పర్సన్ దొరకలేదు అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us