Pawan Kalyan: ‘జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి’.. పవన్ కల్యాణ్‌తో స్నేహంపై ఆనంద్ సాయి ఎమోషనల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో తలమునకలై ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం ఆయన సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్

Pawan Kalyan: జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి.. పవన్ కల్యాణ్‌తో స్నేహంపై ఆనంద్ సాయి ఎమోషనల్
Pawan Kalyan, Anand Sai

Updated on: Feb 22, 2025 | 11:53 AM

పవన్ కళ్యాణ్ కి స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారని తెలిసిందే. అలాంటి వారిలో ఆనంద్ సాయి ఒకరు. పవన్ కళ్యాణ్ – ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. తొలిప్రేమ సినిమా నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ వారి వారి రంగాల్లో పైకి ఎదిగారు. ఎంత ఎదిగినా ఇద్దరి స్నేహం మాత్రం వదల్లేదు. ఎవరి బిజీలో వారున్నప్పటికీ ఒకరిని ఒకరు మర్చిపోకుండా ఇప్పటికీ అలాగే తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక కూడా పవన్ కల్యాణ్, ఆనంద్ సాయి కలిసి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తుండగా ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ పాల్గొనే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ ఆనంద్ సాయి పాల్గొంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్, ఆనంద్ సాయి లతో కలిసి కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించుకున్నారు.

ఈ క్రమంలో ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. అది నాకు దొరికింది. ఎప్పట్నుంచో మేము ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం కలలు కన్నాం. ఈ కోరికే మమ్మల్ని మరింత దగ్గరగా ఉంచింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అది నెరవేరింది. మునుపెన్నడూ లేని విధంగా దివ్య ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టాం’ అని రాసుకొచ్చారు ఆనంద సాయి. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆనంద్ సాయి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..

పవన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద్ సాయి..

గతంలో డిప్యూటీ సీఎంతో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.