అమితాబచ్చన్‌కు దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం

ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఈసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ను వరించింది. ఈ అవార్డు కోసం  బిగ్​బీని ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. అమితాబ్ ఇప్పటివరకు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్​ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్​మన్​గా పేరు తెచ్చుకున్నారు. కాలానికి తగినట్లు పాత్రలు ఎంచుకుంటూ నటనలో నూతన […]

అమితాబచ్చన్‌కు దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2019 | 8:27 PM

ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఈసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ను వరించింది. ఈ అవార్డు కోసం  బిగ్​బీని ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. అమితాబ్ ఇప్పటివరకు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్​ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్​మన్​గా పేరు తెచ్చుకున్నారు. కాలానికి తగినట్లు పాత్రలు ఎంచుకుంటూ నటనలో నూతన మైలురాళ్లు అందుకున్నారు. గొప్ప అవార్డు వరించడంతో భారతీయ చలనచిత్ర ప్రముఖులు బిగ్ బీకి అభినందనలు తెలియజేస్తున్నారు.  సినీ ఇండష్ట్రీలో విశిష్ట సేవలకుగానూ ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. గతేడాది బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు అందజేశారు. అంతకుముందు తెలుగు దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్​ సొంతం చేసుకున్నారు.  తొలిసారిగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 65 మంది సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందజేశారు.