Amitabh Bachchan : ‘పుష్ప’ సినిమా గురించి అమితాబ్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే

ఒక్క సినిమా డీప్రపంచవ్యాప్తంగా ఓ ఊపుఊపింది. అది కూడా మన తెలుగు సినిమా.. జక్కన్న సినిమా కాదండోయ్.. జక్కన సినిమాకు పోటీగా పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన పుష్ప..

Amitabh Bachchan : 'పుష్ప' సినిమా గురించి అమితాబ్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే
Pushpa
Rajeev Rayala

|

Aug 13, 2022 | 5:34 PM

ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. అది కూడా మన తెలుగు సినిమా.. జక్కన్న సినిమా కాదండోయ్.. జక్కన సినిమాకు పోటీగా పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన పుష్ప.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఎర్ర చందనాలు స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన అందరిని కట్టిపడేసింది. సుకుమార్ డైరెక్షన్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ మూవీలోని శ్రీవల్లి పాట అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈసాంగ్ లో బన్నీ సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఈ సాంగ్ కు సినిమాతారల నుంచి స్టార్ క్రికెటర్స్ వరకు అందరు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి ఈ పాట హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఈసారి ఈ సినిమాలోని సాంగ్ గురించి చర్చించారు. బిగ్ బి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షో లో ఈ పాటకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. బిగ్ బి మాట్లాడుతూ ముందు ఆ సాంగ్ చూసి అల్లు అర్జున్ చెప్పు నిజంగానే ఊడిపోయిందా..? లేక స్టెప్ అలా ఉందా అని అనుకున్నా అన్నారు. కానీ అలా చెప్పు వదిలేసి దాన్ని మళ్లీ వేసుకొని చాలా ఫేమస్ అయ్యారు అని చెప్పుకొచ్చారు బిగ్ బి. ఇక పుష్ప సినిమాను ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ తారలు కొనియాడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ పుష్ప సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu