Allu Arjun: అల్లు అర్జున్ సతీమణి స్నేహ పోస్ట్ చేసిన వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

స్టార్‌ హీరోల ఇళ్లు చూడాలని అందరికీ ఉంటుంది. కాని ఏ ఇంటర్యూలోనో.. లేదా వాళ్లు సోషల్ మీడియాలో షేర్‌ చేసే వీడియోల్లోనో చూసి.. "అబ్బా ఎంత బాగుంది" అని అనుకోవడం

Allu Arjun: అల్లు అర్జున్ సతీమణి స్నేహ పోస్ట్ చేసిన వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 02, 2021 | 8:22 AM

స్టార్‌ హీరోల ఇళ్లు చూడాలని అందరికీ ఉంటుంది. కాని ఏ ఇంటర్యూలోనో.. లేదా వాళ్లు సోషల్ మీడియాలో షేర్‌ చేసే వీడియోల్లోనో చూసి.. “అబ్బా ఎంత బాగుంది” అని అనుకోవడం తప్ప.. నేరుగానైతే చూడలేం..ఇప్పుడలా.. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంటి వీడియోటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఎస్‌ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో ఈ వీడియో పోస్ట్‌ చేసింది. చీకటవుతున్న వేళ.. మబ్బు పట్టిన ఆకాశం.. వీస్తున్న చల్లని గాలి.. వీటని చూసి “వాటే వెదర్‌” అని… అనుకుందో ఏమో కాని.. ఇంటి బయట ఉన్న లాన్‌ను.. మాంచి హిందీ సాంగ్‌తో ఇన్‌స్టాలో ప్రజెంట్ చేసింది.

కాని స్నేహ ఇంటెన్షన్‌ను అర్థం చేసుకోని నెటిజన్లు.. లాన్‌ సైజ్‌కు షాకై.. ఇళ్లు ఇంకెంత  రేంజ్‌లో ఉంటుందో అంటూ.. సోషల్ మీడియోలో కమెంట్లు చేస్తున్నారు. ఇక  అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా శూవుటింగ్ దశలో ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన  ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బన్నీ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇంకా అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ… రంగస్థలం వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kajal Agarwal: ఖాళీ స‌మ‌యంలో కాజ‌ల్ కొత్త వ్యాప‌కం.. సూదీ, దారంతో అల్లేస్తోన్న చంద‌మామ‌..

నీలా డబ్బుకోసం తలపాగా ధరించను..! అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..?

Mahesh And Trivikram: అత‌డు… ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..