AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Agarwal: ఖాళీ స‌మ‌యంలో కాజ‌ల్ కొత్త వ్యాప‌కం.. సూదీ, దారంతో అల్లేస్తోన్న చంద‌మామ‌..

Kajal Agarwal: క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ధ‌నిక, పేద అనే తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక ఈ మ‌య‌దారి రోగం ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ప్ర‌తీ ఒక్క‌రిపై ప్ర‌భావం చూపిస్తోంది...

Kajal Agarwal: ఖాళీ స‌మ‌యంలో కాజ‌ల్ కొత్త వ్యాప‌కం.. సూదీ, దారంతో అల్లేస్తోన్న చంద‌మామ‌..
Kajal
Narender Vaitla
|

Updated on: May 01, 2021 | 10:08 PM

Share

Kajal Agarwal: క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ధ‌నిక, పేద అనే తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక ఈ మ‌య‌దారి రోగం ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ప్ర‌తీ ఒక్క‌రిపై ప్ర‌భావం చూపిస్తోంది. థియేట‌ర్లు మూత ప‌డ‌డం ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించ‌డంతో చాలా మంది న‌టీ, న‌టులు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ అప్ర‌క‌టిత లాక్‌డౌన్‌తో చాలా మంది తార‌లు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన వ్యాప‌కాల‌తో ఖాళీ స‌మ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా త‌న‌కు అల‌వాటైన కొత్త వ్యాపాకాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ న‌టిస్తోన్న సినిమాల షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ముంబ‌యిలోని త‌న నివాసంలో ఉంటున్నారు కాజ‌ల్‌. ఈ క్ర‌మంలోనే అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ స‌మ‌యంలో కాజ‌ల్ అల్లిక‌లు వేయ‌డం నేర్చుకున్నారు. సూదీ, దారం సాయంతో ఎంచ‌క్కా అల్లిక‌లు అల్లేస్తున్నారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న అభిమానుల‌తో పంచుకున్నారు. తాను చేసిన అల్లిక‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ… “ప్ర‌స్తుతం బ‌య‌ట ఉన్న ప‌రిస్థితుల‌ను చూస్తుంటే.. నిస్స‌హాయ‌త‌, ఆందోళ‌న క‌లుగుతోంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న మ‌న‌సుల‌ను ఇత‌ర వ్యాపకాల‌పై కేంద్రీక‌రించ‌డం చాలా ముఖ్యం. అది ఎలాంటి ప‌ని అయినా స‌రే కొత్త ప‌నిని ప్రారంభించాలి. దీనివ‌ల్ల మ‌న‌సు తేలిక‌ప‌డ‌డ‌మే కాకుండా ఒక పనిని సాధించామ‌నే తృప్తినిస్తుంది. ప్ర‌స్తుతం నేను అలాంటి ప‌నినే ఎంచుకున్నాను. ఇటీవ‌ల అల్ల‌డం నేర్చుకున్నాను.. ఇది నాకు మాన‌సిక ప్ర‌శాంత‌త అందించ‌డంతో పాటు విశ్రాంతిని ఇస్తోంది. మ‌రి ఈ ఖాళీ స‌మ‌యంలో మీరేం చేస్తున్నారు.?” అంటూ సుధీర్ఘంగా రాసుకొచ్చారు కాజ‌ల్‌.

కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

Also Read: నీలా డబ్బుకోసం తలపాగా ధరించను..! అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..?

Mahesh And Trivikram: అత‌డు… ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..

Raja The Great: ‘ఇట్స్ సీక్వెల్ టైమ్‌’… మ‌రోసారి అంధుడిగా అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ‌.?