Pushpa 2: పుష్పాగాడి రేంజ్ వేరబ్బా! .. 6 నిమిషాల గంగమ్మ జాతర కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

|

Apr 10, 2024 | 9:32 PM

అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ' పుష్ప 2 ' టీజర్ ఇటీవల విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసేస్తోంది

Pushpa 2: పుష్పాగాడి రేంజ్ వేరబ్బా! .. 6 నిమిషాల గంగమ్మ జాతర కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
Pushpa 2 Movie
Follow us on

అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ పుష్ప 2 ‘ టీజర్ ఇటీవల విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసేస్తోంది. కాగా టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని చూసినవారందరికీ అర్థమవుతుంది. కాగా పుష్ప 2 టీజర్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ను వెచ్చించారని ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. విశేషమేమిటంటే.. ఈ జాతర సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో 30 రోజులకు పైగా చిత్రీకరించారట. ఈ సన్నివేశం షూటింగ్ అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరిగింది. సినిమాలో కీలకమైన సన్నివేశం కాబట్టి వందలాది మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక మేకప్, లైటింగ్ సెటప్‌లు, భారీ సెట్‌లు ఇలా ప్రతిదానికీ భారీగానే ఖర్చు చేశారట నిర్మాతలు. ఈ సన్నివేశానికి ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు ముంబై నుంచి ఖరీదైన కెమెరాలను సైతం తెప్పించారట. దీని షూటింగ్ కోసం దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇక స్టార్ నటీనటుల రెమ్యూనరేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ తదితరాలు అన్నీ కలుపుకుంటే మరో 20 కోట్ల రూపాయలు కావాలి. ఈ గంగమ్మ జాతర పాట సన్నివేశం సినిమాలో ఆరు నిముషాల పాటు ఉంటుందని, ఇది సినిమాకి ఒక హైలైట్ అని మేకర్స్ అంటున్నారు. ఈ ఒక్క ఆరు నిమిషాల సన్నివేశానికి సుమారు రూ. 60 కోట్లు వరకు ఖర్చు అయిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.డిసెంబర్ 2021లో విడుదలైన ‘పుష్ప 1’ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రానికి కూడా భారీ ఓపెనింగ్ రావాల్సి ఉంది. అందుకోసం చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. పాన్-ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు మొత్తం బడ్జెట్ 250 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.