సినిమా చూసా.. అందరూ ఇరగదీశారు.. ఆ మూవీ పై అల్లు అర్జున్ అదిరిపోయే రివ్యూ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే జపాన్ లో పర్యటించారు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొన్నారు.

సినిమా చూసా.. అందరూ ఇరగదీశారు.. ఆ మూవీ పై అల్లు అర్జున్ అదిరిపోయే రివ్యూ
Allu Arjun

Updated on: Jan 20, 2026 | 4:59 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటు భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అట్లీ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. దాంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ఓ సినిమా పై రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయింది అంటూ చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ మూవీ పై ప్రశంసలు కురిపించారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆ సినిమా ఎదో కాదు.. లేటెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న పేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను సినిమా దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ

ఇప్పటికే ఈ సినిమా 300కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందని తెలుస్తుంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి , ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజగా అల్లు అర్జున్ చిరంజీవి సినిమాకు అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. చిత్రయూనిట్ అందరికి అభినందనలు.. బాస్ ఈస్ బ్యాక్.. చిరంజీవి గారు మరోసారి స్క్రీన్ పై వెలిగిపోయారు… చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ గారు అదరగొట్టారు. నయనతార చాలా అందంగా కనిపించారు. భీమ్స్ అందించిన సంగీతం సూపర్ గా ఉంది అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. అబినందనలు సక్సెస్ మిషన్ అనిల్ గారు. సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారు.. రిపీట్ అంటూ రాసుకొచ్చారు అల్లు అర్జున్.

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..