Pushpa Movie: పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. అందమైన ఫోటో షేర్ చేసిన మేకర్స్.. మీరు చూశారా ?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప.. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప.. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. అల్లు అర్జున్.. కెరీర్లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో మేక పాటకు రెస్పాన్స్ భారీగానే వచ్చింది. విడుదలైన గంటల్లోనే దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. ఈ పాటను దాదాపు ఐదు భాషలలో విడుదల చేశారు మేకర్స్. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్, తమిళంలో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా.. పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ ఫోటోను షేర్ చేసింది చిత్రయూనిట్. అద్భుతమైన ప్రదేశంలో పుష్ప సెకండ్ సింగిల్ సాంగ్ చిత్రీకరించనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా విడుదలైన ఫోటోలో షూటింగ్ స్పాట్ లో వేసిన టెంట్ .. కారవాన్లు .. ప్రొడక్షన్ వ్యాన్లు అక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు .. పచ్చని ప్రకృతి .. నిండుగా ప్రవహిస్తున్న నదీ .. ఆ నదీ తీరాన సాంగ్ షూట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫోటోతో మరోసారి అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేశారు పుష్ప మేకర్స్. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్ంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ .. లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రష్మిక గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో ప్రతినాయకుడి పాత్రలో మళయాలం నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు.
ట్వీట్..
A song from #PushpaTheRise was shot at a beautiful and picturesque location few days back ❤️
Update about the most awaited Second Single soon ?#Pushpa #ThaggedheLe ?@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/bki2EvrZGP
— Mythri Movie Makers (@MythriOfficial) September 27, 2021
Also Read: Samantha: జోరు వానలో సమంత ప్రయాణం.. నిన్ను కచ్చితంగా చేరుకుంటాను అంటూ పోస్ట్.
Adivi Sesh: అడివి శేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తాజా హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న హీరో..