
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘పుష్ప 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం భారీ ప్రమోషన్‌ను ప్లాన్ చేసింది. ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. . అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార జోరు కూడా పెరుగుతోంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ‘పుష్ప 2’ చిత్రాన్ని నిర్మించింది . లావిష్ గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాని అట్టహాసంగా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసే సమయం వచ్చింది. కేవలం సోషల్ మీడియాలో ట్రైలర్‌ను విడుదల చేయడం లేదు. బిహార్ లోని పాట్నాలో భారీ వేదికను నిర్మించి వేలాది మంది అభిమానుల సమక్షంలో నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. కాగా, ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ‘పుష్ప 2’ టీమ్ బిహార్‌ను ఎంచుకోవడం మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించాలి కాబట్టి అక్కడ కూడా ప్రమోషన్ బాగా జరగాలి. అందుకే బిహార్‌ను ఎంచుకున్నారు.
ఇక 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్ప రాజ్ అనే ఊర మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో పుష్ప ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్, వీడియోలు చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్ రీల్స్ చేసింది. బిహార్ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి క్రేజ్ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్ సందర్భంగా ‘పుష్ప’లోని శ్రీవల్లి సాంగ్ బాగా వినిపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి ‘తూ హై గజాబ్ యూపీ.. తేరి కసం యూపీ’ అంటూ లిరిక్స్ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్, యూపీలో పుష్ప క్రేజ్ ఊహించని రేజ్ లో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చని, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చని అంచనా వేస్తోంది.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.