AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్పరాజ్‌ వర్సెస్‌ సింగం.. ఒకే రోజు రిలీజ్‌ కానున్న అల్లు అర్జున్‌, అజయ్‌ దేవగన్‌ సినిమాలు

పాన్‌ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. దీనికి సంబంధించి సోమవారం (సెప్టెంబర్‌ 11) అధికారిక ప్రకటన వెలువరించారు మేకర్స్‌. దీంతో ఈ సినిమా రిలీజ్‌తో క్లాష్‌ కాకుండా ఇతర చిత్రాల నిర్మాతలు జాగ్రత్తపడుతున్నారు. అయితే బాలీవుడ్ సినిమా ‘సింగం ఎగైన్ ’ మాత్రం పుష్పరాజ్‌కు పోటీగా బరిలోకి దిగి పెద్ద సాహసమే చేస్తోంది. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా కూడా ఆగస్ట్ 2024 ఆగస్టు 15నే విడుదల కానుంది.

Pushpa 2: పుష్పరాజ్‌ వర్సెస్‌ సింగం.. ఒకే రోజు రిలీజ్‌ కానున్న అల్లు అర్జున్‌, అజయ్‌ దేవగన్‌ సినిమాలు
Ajay Devgn, Allu Arjun
Basha Shek
|

Updated on: Sep 12, 2023 | 9:58 AM

Share

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తోన్న క్రేజీ సీక్వెల్‌ ‘పుష్ప 2’ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా థియేటర్లలో విడుదల కానుంది . ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. అలాగే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2021 లో విడుదలైన ‘పుష్ప’ సినిమాకు గానే జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు అల్లు అర్జున్‌ . దీంతో ఈ క్రేజీ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.   పాన్‌ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. దీనికి సంబంధించి సోమవారం (సెప్టెంబర్‌ 11) అధికారిక ప్రకటన వెలువరించారు మేకర్స్‌. దీంతో ఈ సినిమా రిలీజ్‌తో క్లాష్‌ కాకుండా ఇతర చిత్రాల నిర్మాతలు జాగ్రత్తపడుతున్నారు. అయితే బాలీవుడ్ సినిమా ‘సింగం ఎగైన్ ’ మాత్రం పుష్పరాజ్‌కు పోటీగా బరిలోకి దిగి పెద్ద సాహసమే చేస్తోంది. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా కూడా ఆగస్ట్ 2024 ఆగస్టు 15నే విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్లాష్ రాకుండా చూసేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, కొన్నిసార్లు ఈ రకమైన పోటీ తప్పదు. ‘పుష్ప 2’, ‘సింగం ఎగైన్‌’ సినిమాల విషయంలోనూ అదే జరుగుతోంది. ఒకే రోజున ఈ భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి. ఏ సినిమాకి ఎంత వసూళ్లు వస్తాయని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాల విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ మధ్యన రిలీజ్ డేట్స్‌ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పుష్ప వర్సెస్‌ సింగం

సుకుమార్‌ ‘పుష్ప 2’ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్, సునీల్‌, అనసూయ సహా పలువురు ప్రముఖ ఆర్టిసులు నటిస్తున్నారు. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ‘పుష్ప 2’ సినిమా గురించే చర్చ సాగుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సింగం ఎగైన్‌’ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొణె కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ అతిథి పాత్రలు పోషిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంత హిందీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇండిపెండెన్సెడే కానుకగా అల్లు అర్జున్  పుష్ప 2 రిలీజ్  

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..