Pushpa 2 Collections: మూడు రోజుల్లో పుష్ప 2 సెన్సేషన్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన పుష్పరాజ్..

|

Dec 08, 2024 | 6:58 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబోలో వచ్చిన సినిమా పుష్ప 2. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‏లో సత్తా చాటింది. ఇక డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్లతో సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది.

Pushpa 2 Collections: మూడు రోజుల్లో పుష్ప 2 సెన్సేషన్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన పుష్పరాజ్..
Pushpa 2
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దూసుకుపోతుంది పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అన్ని ఏరియాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప 2. ఆ తర్వాత రెండో రోజు దాదాపు రూ.155 కోట్లు రాబట్టి రెండు రోజుల్లోనే రూ.449 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు మధ్యాహ్నానికే రూ.500 కోట్ల గ్రాస్ దాటేసింది పుష్ప 2. మొత్తం మూడు రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా మూడు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీకెండ్ సందర్భంగా పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు నార్త్ లో సత్తా చాటుతున్నాడు పుష్పరాజ్. ముఖ్యంగా హిందీలో బాలీవుడ్ స్టార్స్ రికార్డ్స్ బద్దలుకొడుతున్నాడు. నాలుగు రోజుల్లో పుష్ప రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. నార్త్, ఓవర్సీస్ లో పుష్ప 2 కలెక్షన్స్ ఊహించిన దానికంటే వస్తున్నాయి. దీంతో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ రూ.1200 కోట్లు వసూలు చేస్తుందని తెలుస్తోంది.

ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు పుష్పరాజ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అడియన్స్. ముఖ్యంగా ఈ చిత్రంలోని జాతర సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.