ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ వేశారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. కాగా తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్‌లో కోరారు అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన హై కోర్టులలో పిటీషన్ వేశారు.
ఈనెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.