AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘శాకుంతలం’సెట్‌‌‌‌లో ఐకాన్ స్టార్… కూతురి యాక్టింగ్ చూసి మురిసిపోయిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన తనయ అల్లు అర్హకు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది

Allu Arjun: 'శాకుంతలం'సెట్‌‌‌‌లో ఐకాన్ స్టార్... కూతురి యాక్టింగ్ చూసి మురిసిపోయిన బన్నీ
Bunny
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2021 | 4:43 PM

Share

Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన తనయ అల్లు అర్హకు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది. ఈ చిన్నారి తన అల్లరితో ముద్దుముద్దు మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అర్హ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ  అల్లరి పిల్ల సినిమాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నశాకుంతలం సినిమాలో అర్హ నటిస్తుంది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం అర్హను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌‌‌లో అల్లు అర్హ జాయిన్ అయ్యింది.1 తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్‌‌‌కు వెళ్లారు అల్లు అర్జున్. శనివారం భార్య స్నేహ, కొడుకు అయాన్‌‌‌తో కలిసి శాకుంతలం షూటింగ్‌‌‌కు వెళ్లారు బన్నీ. సెట్‌‌‌‌లోనే కాసేపు గడిపి అల్లు అర్హ పాల్గొనే సన్నివేశాల షూటింగ్‌‌‌‌‌ని గమనించారు.2.సెట్‌‌‌‌లో బన్నీ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి అర్హ ఎంట్రీనే పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇక మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల – దుష్యంతుడి అందమైన ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో డీఆర్పీ – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.3

మరిన్ని ఇక్కడ చదవండి : 

 Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..

Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..