ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ మూవీ కోసం పుష్పరాజ్‌కి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తగ్గేదేలే అంటూ ఈ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో అటు క్రీడకారులను, ఇటు రాజకీయనాయకులను ప్రభావితం చేసాడు పుష్పరాజ్. విడుదలైన అన్ని భాషల్లోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే పుష్ప మేనియా ఏమాత్రం తగ్గడం లేదు.
సినిమా వచ్చి దాదాపు సంవత్సం కావొస్తున్నా ఇంకా పుష్ప రాజ్ మన కళ్ళముందే తిరుగుతున్నాడు. సుకుమార్ రాసిన పాత్రలో బన్నీ ఒదిగిపోయి సినిమాలో సిండికేట్ వ్యవస్థను శాసించినట్లు, బయట సరికొత్త రికార్డ్స్ ను శాసిస్తున్నాడు పుష్ప రాజ్. ఇక ఇప్పుడు పుష్ప చిత్రాన్ని రష్యాలో ప్రీమియర్స్ వేయనున్నారు. డిసెంబర్ 1 న మాస్కోలో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. డిసెంబర్ 3న పీటర్స్బర్గ్ లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కి సినిమా కాస్ట్ &క్రూ కూడా హాజరు కానుంది. పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది. డిసెంబర్ 1,3 తేదీల్లో కూడా గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ప్రీమియర్లకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా .. డైరెక్టర్ సుకుమార్.. నిర్మాతలతోపాటు చిత్రయూనిట్ హాజరకానుంది. తమ సినిమాకు వీలైనంత వరకు ప్రచారం కల్పించనున్నారు.
ప్రస్తుతం పుష్ప చిత్రానికి సీక్వె్ల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 చిత్రీకరణలో బన్నీ పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Meet team #PushpaTheRise at the Russian language premieres?
Dec 1st – Moscow
Dec 3rd – St. Petersburg#PushpaTheRise releasing in Russia in Russian Language on Dec 8th ?#PushpaInRussiaIcon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @4SeasonsCreati1 pic.twitter.com/lyouNRRemj
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.